రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన నిర్భయ దోషి వినయ్ శర్మ

  • నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి
  • ఉరి తప్పించుకునేందుకు వినయ్ శర్మ చివరి ప్రయత్నం
  • రాష్ట్రపతి క్షమాభిక్ష కోరినట్టు వినయ్ శర్మ న్యాయవాది వెల్లడి
నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ ఉరి నుంచి తప్పించుకునేందుకు చివరి ప్రయత్నం చేశాడు. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. వినయ్ శర్మ న్యాయవాది ఈ విషయం తెలియజేశారు. ఫిబ్రవరి 1న నిర్భయ దోషులు నలుగుర్నీ ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో ఉరితీత మరోసారి ఆలస్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Nirbhaya
Vinay Sharma
Hang
Death
President Of India
Mercy Plea

More Telugu News