ప్రధాని మోదీని కలుస్తాం..అమరావతిని తరలించొద్దని కోరతాం: శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి

  • అమరావతిలో కాలభైరవ మహా యాగం ముగిసింది  
  • ఈ సందర్భంగా ఐదు తీర్మానాలు చేశాం
  • ఈ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం: శివస్వామి
రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతుల నిరసనలు, ఆందోళనలు నలభై రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజధానిని తరలించకూడదని కోరుకుంటూ శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో శ్రీపాశుపత సంపుటీకరణ కాలభైరవ మహాయాగం ఈరోజుతో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగంలో రైతు కుటుంబాలు, అక్కడి ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో శివస్వామి మాట్లాడుతూ, రాజధానిగా అమరావతినే కొసాగించాలని, ‘జై అమరావతి’ నినాదంతో తిరుపతిలో లక్ష మందితో సభ నిర్వహించాలని, ప్రధాని మోదీని కలిసి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేయాలని, శ్రీకాకుళం జిల్లాలోని స్వామీజీలు, తిరుపతిలోని స్వామీజీలు పాదయాత్రలు నిర్వహించాలని, వేలాది మందితో సీఎం జగన్ నివాసానికి తరలివెళ్లి ఓ వినతిపత్రం సమర్పించాలని, రాజధాని తరలింపువల్ల తలెత్తే ఇబ్బందులు, నష్టాన్ని గురించి పట్టించుకోకుండా విజయవాడ, గుంటూరు పట్టణాల్లో కుంభకర్ణుల్లా నిద్రపోతున్న యంత్రాంగాన్ని నిద్రలేపేందుకు కరపత్రాలు పంపిణీ చేయాలని తీర్మానాలు చేసినట్టు వివరించారు.
Go Back to Shorts
Amaravati
capital
Mahakalabhairava Yagam
Farmers

More Telugu News