తన కుమారుడి పెళ్లికి రావాలంటూ ప్రధాని మోదీకి శుభలేఖ అందించిన సీఎం రమేశ్

  • ఫిబ్రవరి 7న సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం
  • ఇటీవలే దుబాయ్ లో ఘనంగా నిశ్చితార్థం
  • ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తెతో రిత్విక్ వివాహం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో పీఎంవోలో మోదీని కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు శుభలేఖ అందించారు. ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం భారత్ నుంచి అతిథులు వెళ్లేందుకు సీఎం రమేశ్ ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.
Go Back to Shorts
CM Ramesh
Rirhwik
Wedding
Narendra Modi
Prime Minister
BJP

More Telugu News