Congress: సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచాడు: జగన్‌పై బుద్ధా వెంకన్న విమర్శలు
- రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్ ని బలితీసుకున్నాడు
- ఈ ఘటనలకు తెరవెనుక మంత్రాంగం నడిపింది ఏ2 విజయసాయిరెడ్డి గారు
- మూడు ముక్కలాటకి ప్రజలు ఛీ కొట్టడంతో సొంత కార్యకర్తలను రంగంలోకి దింపారు
- ప్రతిపక్ష నాయకుడి దిష్టి బొమ్మలు తగలవెయ్యమని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. 'నాన్నకి, తనకి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచాడు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్ ని బలితీసుకున్నాడు. ఈ ఘటనలకు తెరవెనుక మంత్రాంగం నడిపింది ఏ 2 విజయసాయిరెడ్డి గారు'
'అధికార పార్టీ విధ్వంసం చెయ్యమని సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చింది అంటేనే మూడు రాజధానుల అంశం ఫెయిల్ అయ్యింది అని అర్థమైంది. మూడు ముక్కలాటకి ప్రజలు ఛీ కొట్టడంతో సొంత కార్యకర్తలను రంగంలోకి దింపి ప్రతిపక్ష నాయకుడి దిష్టి బొమ్మలు తగలవెయ్యమని చెప్పి జగన్ స్థాయిని మరింత దిగజారుస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు' అని ట్వీట్లు చేశారు.