ఇంట్లో దాచిన మద్యం సీసా మాయం.. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి!
- తీవ్రంగా గాయపడిన సోదరి మృతి
- చికిత్స పొందుతున్న మరో ఇద్దరు
- చెన్నైలోని వళసరవాక్కంలో ఘటన
ఈ క్రమంలో ఇంట్లో పెట్టిన మద్యం సీసా కనిపించకపోవడంతో శుక్రవారం రాత్రి సోదరితో గొడవ పడ్డాడు. అది మరింత పెరగడంతో ఆమెపై కత్తితో దాడిచేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన వేదనాయకి, ఆదికేశవన్పైనా దాడి చేశాడు. వారి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే ఇంట్లోకి వెళ్లి, గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తారకేశ్వరి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.