ఏపీలో వేడుకగా గణతంత్ర వేడుకలు!
- సచివాలయంలో జెండా ఎగురవేసిన నీలం సాహ్ని
- సీఎంఓలో అజేయకల్లం, అసెంబ్లీలో తమ్మినేని
- జిల్లా కేంద్రాల్లో జెండాలను ఎగురవేసిన కలెక్టర్లు
తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాలయంలో ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవేయగా, సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఇక అసెంబ్లీలో జరిగిన వేడుకల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేశారు. శాసనమండలిలో ఛైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలు, ఆర్డీఓలు జాతీయ జెండాలను ఎగురవేశారు.