ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా భారత్

  • అగ్రస్థానంలో చైనా
  • అమెరికాను వెనక్కినెట్టిన భారత్
  • 2019లో 158 మిలియన్ స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు, దిగుమతులు
భారత్ లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం గణనీయంగా పెరిగింది. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు దేశంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించింది. గతేడాది భారత్ లో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు, దిగుమతుల సంఖ్య 158 మిలియన్లు. 2018తో పోల్చితే ఇది 7 శాతం అధికం. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు భారత్ జోరుతో మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తన లేటెస్ట్ రిపోర్టులో పేర్కొంది.

ఇక గతేడాది భారత్ లో చైనా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల వాటా 72 శాతంగా నమోదైంది. బ్రాండ్ల పరంగా చూస్తే షియోమీ ఫోన్లదే అగ్రస్థానం. ఈ సంస్థ ఫోన్లు 28 శాతం అమ్ముడవగా, ఆ తర్వాత 21 శాతం అమ్మకాలతో శాంసంగ్ రెండో స్థానంలో ఉంది. ఇతర ప్రధాన బ్రాండ్లయిన వివో (16 శాతం), రియల్ మీ (10 శాతం), ఒప్పో (9 శాతం) కూడా మార్కెట్ లో తమ పట్టు నిరూపించుకున్నాయి.
Go Back to Shorts
India
Smart Phone
Market
China
USA
Xiaomi
Samsung
OPPO
Real Me

More Telugu News