అనిల్ రావిపూడి తీరుపట్ల హర్ట్ అయిన బండ్ల గణేశ్
- తొలినాళ్లలో కమెడియన్ గా బండ్ల గణేశ్
- నిర్మాతగా భారీ చిత్రాల నిర్మాణం
- తన సీన్స్ లేపేయడం పట్ల కోపంగా వున్న బండ్ల
ఈ సినిమాలో బండ్ల గణేశ్ దొంగ పాత్రలో ట్రైన్ ఎపిసోడ్ లో కనిపిస్తాడు. ఆయన మెడలో 'బ్లేడ్'తో కూడిన చైన్ వేసి మరీ అనిల్ ఆడియన్స్ ను నవ్వించాడు. ఈ ఎపిసోడ్ లో బండ్ల గణేశ్ హఠాత్తుగా ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణం ఆయనకి సంబంధించిన మిగతా సీన్స్ ను లేపేయడమేనట. తనకి సంబంధించిన మొత్తం ట్రాక్ లేపేసినా బాధపడేవాడిని కాదనీ, చిన్న సీన్ మాత్రమే ఉంచి తన పరువు తీశాడని గణేశ్ హర్ట్ అయ్యాడట. అందుకే, అనిల్ రావిపూడి పట్ల కాస్త కోపంగా వున్నాడట.