ఇలా సెల్ఫీ తీసుకుంటుంటే... అలా సెల్లు లాక్కెళ్లిన చోర శిఖామణి... వైరల్ వీడియో ఇదిగో!
- స్నేహితురాలితో రోడ్డుపై సెల్ఫీ దిగుతున్న యువతి
- ఒడుపుగా లాగేసుకుని వెళ్లిన దొంగ
- ఎవరూ ఏమీ చేయలేకపోయిన వైనం
ఈ ఘటనను చూసిన కొందరు స్థానికులు అతన్ని వెంబడించాలని ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. రోడ్లపై ఈ తరహా పనులేంటని కొందరు మండిపడుతుంటే, జాగ్రత్తగా ఉండాలికదా? అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.