జగన్ పులివెందుల పులి కాదు.. పిల్లి: దేవినేని ఉమ
- డమ్మీ కాన్వాయ్ తో అసెంబ్లీకి వెళ్లిన ఘనత జగన్ దే
- మంత్రుల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
- అమరావతి.. మృతుల కుటుంబాలను పరామర్శించలేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ.. తదితర బిల్లులపై ఇటు శాసనసభలో.. అటు శాసన మండలిలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు మాట్లాడుతున్న మాటలను ఆయన ఖండించారు. మంత్రుల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. అమరావతి కోసం 24 మంది రైతులు చనిపోతే సీఎం జగన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేదని విమర్శించారు.
రైతుల మృతి పట్ల అసెంబ్లీలో కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. డమ్మీ కాన్వాయ్ తో అసెంబ్లీకి వెళ్లిన ఘనత జగన్ దని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. రాజధానిపై కోర్టులో న్యాయం జరుగుతుందని తనకు విశ్వాసముందని చెప్పారు. అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేశారు.