ఇక దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు.. జూన్ 1 నుంచి అమల్లోకి!
- గతంలో జూన్ 30 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటన
- ఇప్పుడు నెల రోజుల ముందుకు జరిపిన ప్రభుత్వం
- వలసదారులకు వరంగా మారనున్న వైనం
జూన్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకం అమల్లోకి రానుంది. ఫలితంగా రేషన్ లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు లభించనుంది. జనవరి 1 నుంచి దేశంలోని 12 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లోకి వచ్చింది. జూన్ నుంచి ఇది దేశవ్యాప్తం కానుంది.
నిజానికీ పథకం జూన్ 30 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే, ఇప్పుడు దీనిని అదే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నట్టు కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. కేంద్రం అమల్లోకి తెస్తున్న ఈ విధానం వలసదారులకు వరం కానుంది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నా వీరు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు పొందవచ్చు.