జగన్ సంపాదనలో నుంచి తమకు జీతాలిస్తున్నారని పోలీసులు అనుకుంటున్నారేమో!: సబ్బం హరి
- రైతులపై పోలీసుల దాడులు దారుణం
- పోలీసుల దారుణం డీజీపీకి కనిపించటం లేదా?
- రాజధాని తరలింపుపై ఏదో రహస్యం ఉంది
జగన్ సంపాదనలో నుంచి తమకు జీతాలు ఇస్తున్నారని పోలీసులు అనుకుంటున్నారేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో డీజీపీకి కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. తెలుగు జాతి కోసం భూములు ఇచ్చిన వారిని లాఠీలతో చితగ్గొట్టి గౌరవిస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. విశాఖకు రాజధానిని తరలించడం వెనుక ఏదో రహస్యం ఉందని, అది త్వరలోనే విశాఖ వాసులు తెలుసుకుంటారని అన్నారు.