‘నౌకరీ పే చర్చ’ చేపట్టి నిరుద్యోగుల ‘మన్ కీ బాత్ వినాలి’: సీపీఎం నేత సీతారాం ఏచూరి
- ప్రధాని ‘పరీక్షా పే చర్చ‘ కార్యక్రమం పై ఏచూరి విమర్శలు
- నోట్ల రద్దు, ప్రణాళిక లేని జీఎస్టీతో నిరుద్యోగం పెరిగింది
- దేశ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగిత నెలకొంది
ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మోదీ ‘నౌకరీ పే చర్చ’ అనే కార్యక్రమం చేపట్టి నిరుద్యోగుల ‘మన్ కీ బాత్’ కూడా వినాలని పేర్కొన్నారు. నోట్ల రద్దు, ప్రణాళిక లేని జీఎస్టీ అమలుతో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఇంత స్థాయిలో నిరుద్యోగితను తానెప్పుడూ దేశంలో చూడలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం నిరుద్యోగిత స్థాయి 44 శాతానికి చేరుకుందని చెప్పారు.