జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు నిద్రపోను.. వైసీపీ వినాశనం మొదలైంది: పవన్ కల్యాణ్
- ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించారు
- ఇకపై వైసీపీకి అధికారం ఉండదు
- నమ్మి ఓట్లు వేస్తే.. మోసం చేస్తోంది
ఏపీలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి, నిరంకుశ ధోరణితో పాలిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు తాను నిద్రపోనని తెలిపారు. వైసీపీ నాశనం మొదలైందని చెప్పారు. అమరావతికి భూములు ఇచ్చిన ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించారని... వారి శాపాలు ఊరికే పోవని అన్నారు. మంగళగిరిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు వారి వినాశనం కోసమేనని చెప్పారు. వైసీపీకి ఇదే తొలి, చివరి అధికారమని... ఇకపై వారికి రాష్ట్రంలో అధికారం ఉండదని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి ఎవరూ తరలించలేరని చెప్పారు. నమ్మి ఓట్లు వేస్తే.. వైసీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు.