మిమ్మల్ని జనాలు పిచ్చి తుగ్లక్ అనుకుంటున్నారే తప్ప హీరో అనుకోవడం లేదు: కన్నా లక్ష్మీనారాయణ
- రైతులకు ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీతో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు
- జగన్ చెబుతున్న కారణాలు, కబుర్లు నమ్మదగినవి కాదు
- 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రజాగ్రహాన్ని చవిచూస్తుంది
అమరావతి రైతులకు, రైతు కూలీలకు మీరు ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీ ఖర్చుతో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని కన్నా చెప్పారు. ఈ నేపథ్యంలో మీకు ఖర్చు ఒక్కటే కారణమని తాను భావించడం లేదని అన్నారు. అమరావతిలో మరో భూదందాకు మీరు తెరలేపబోతున్నారనే కారణమే తనకు కనిపిస్తోందని చెప్పారు. అమరావతిపై మీరు చెబుతున్న కారణాలు, కబుర్లు నమ్మదగినవి కాదని అన్నారు. అసెంబ్లీని ఇక్కడ ఉంచి సెక్రటేరియట్ ను విశాఖలో పెడతామని చెప్పడం పిచ్చి తుగ్లక్ ను మరిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు మిమ్మల్ని పిచ్చి తుగ్లక్ అనుకుంటున్నారే తప్ప... మిమ్మల్ని హీరో అనుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై జనసేనతో కలిసి పోరాడుతామని... ఇరు పార్టీలు కలిసి కార్యాచరణను రూపొందిస్తాయని చెప్పారు.