Payyavula Keshav: ఏపీ ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ సవాల్

  • బినామీలపై చర్యలకు కేంద్రం కఠిన చట్టం తీసుకొచ్చింది
  • బినామీ ఆస్తులను కేంద్రానికి అటాచ్ చేయాలి
  • ఆ భూములు అమ్మి రాష్ట్ర ఖజనాకు ఇవ్వాలి
వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకులకు బినామీల పేరిట అమరావతిలో భూములు ఉన్నాయని చేస్తున్న ఆరోపణలు తగదని, ఇందుకు సంబంధించిన బినామీ భూముల జాబితాను కేంద్రానికి పంపాలని, బినామీ ఆస్తులను కేంద్రానికి అటాచ్ చేయాలని సవాల్ విసిరారు.

ఆ భూములు అమ్మి రాష్ట్ర ఖజనాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బినామీ ఆస్తులను జప్తు చేయాలని కోరితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. బినామీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చిందని, ఆ భూములను వెంటనే సీజ్ చేసే అధికారం కేంద్రానికి ఉందని అన్నారు. ఆ చట్టానికి సంబంధించిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదేమో అన్న పయ్యావుల కేశవ్, బినామీ యాక్టుకు సంబంధించిన ప్రతిని స్పీకర్ తమ్మినేని ద్వారా ప్రభుత్వానికి అందజేశారు.
Payyavula Keshav
Telugudesam
Andhra Pradesh

More Telugu News