Andhra Pradesh: అమరావతి పోలీస్ స్టేషన్ లో రైతులను పరామర్శించిన లోకేశ్

  • అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రైతులు
  • అనేకమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రైతుల తరఫున తాము పోరాడతామని లోకేశ్ భరోసా
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అమరావతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాజధాని ప్రాంత రైతులను పరామర్శించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, రైతుల తరఫున తాము పోరాడతామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పలు గ్రామాలకు చెందిన రైతులను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్నిచోట్ల లాఠీచార్జి జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో, పీఎస్ కు వెళ్లిన లోకేశ్ తో రైతులు ఆవేదన వెలిబుచ్చారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారని వారు వాపోయారు. కొన్నిచోట్ల మహిళలని కూడా చూడకుండా కొట్టారని వెల్లడించారు.
Andhra Pradesh
Amaravati
AP Capital
Nara Lokesh
Telugudesam
Police
Farmers

More Telugu News