Ambati Rambabu: అమరావతి కోసం 24 మంది చనిపోయారా..? గుంటూరులో ఉన్న నాకే ఆ విషయం తెలియదే!: అంబటి

  • అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • టీడీపీ మాట మార్చే రోజు వస్తుందని వ్యాఖ్యలు
  • సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి
మూడు రాజధానులే ముద్దు అంటూ వైసీపీ, అమరావతి కావాలని టీడీపీ... అసెంబ్లీ సమావేశాల ప్రారంభదినం నాడు సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు నడిచాయి. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 "అమరావతి కోసం 24 మంది రైతులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో ఉన్న నాకే ఆ విషయం తెలియదు. అంతా అసత్య ప్రచారమే" అంటూ మండిపడ్డారు. టీడీపీ మాట మార్చే రోజు వస్తుందని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మేం ఎప్పుడు వద్దన్నాం అంటూ మరో మాట చెప్పడం ఖాయమని అన్నారు. గతంలో ఇంగ్లీషు మీడియం విషయంలోనూ ఇలాగే వ్యవహరించి, ఆ తర్వాత మేమెప్పుడు వద్దన్నామంటూ టీడీపీ నేతలు మాట మార్చారని ఆరోపించారు. 'మాది తుగ్లక్ ప్రభుత్వం అంటున్నారు, ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చిన మీదే తుగ్లక్ పాలన అంటూ విమర్శించారు.
Ambati Rambabu
Andhra Pradesh
YSRCP
Assembly
Amaravati
Farmers

More Telugu News