మసీదులో హిందూ వివాహం... 10 సవర్ల బంగారం, రూ. 2లక్షల కట్నమిచ్చిన మత పెద్దలు!
- కేరళలోని చెరుపల్లి జమాత్ మసీదులో ఘటన
- బిడ్డ వివాహానికి సహకరించాలని కోరిన పేద తల్లి
- 1000 మందికి భోజనాలతో ఘనంగా వివాహం
ఇక పెళ్లికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని నిర్ణయించుకున్న మత పెద్దలు, వధువు అంజుకు 10 సవర్ల బంగారాన్ని కానుకగా ఇవ్వడంతో పాటు, వరుడు శరత్ కు రూ. 2 లక్షల కట్నాన్ని కూడా అందించడం గమనార్హం. వివాహం అనంతరం పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేయగా, పలువురు బంధుమిత్రులు, ముస్లిం పెద్దలు హాజరై, యువ జంటకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేశామని మసీదు కమిటీ కార్యదర్శి నుజుముద్దీన్ అలుమ్మూట్టిల్ వ్యాఖ్యానించారు.