జగన్ అరాచకాలకు అంతు లేకుండా పోయింది: చంద్రబాబు

  • ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా?
  • నేతల హౌస్ అరెస్ట్ హేయమైన చర్య
  • వెంటనే విడిచి పెట్టాలని చంద్రబాబు డిమాండ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గరలోనే ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తనను కలిసిన పార్టీ నేతలతో అసెంబ్లీలో అమలు చేయాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. అమరావతిలో జరిగే నిరసనలను అడ్డుకోవడం, ఐకాసతో పాటు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ లు చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. పోలీసులను అడ్డు పెట్టుకుని జగన్ రెచ్చిపోతున్నారని, ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నారని విమర్శించారు.

ప్రస్తుతం అమరావతిలో ఎమర్జెన్సీ సమయంలో ఉన్న నిర్బంధం కన్నా అధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పౌర హక్కులకు భంగం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధం చేసిన తమ నేతలను వెంటనే విడిచి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Amaravati
Protest
Assembly

More Telugu News