సత్య జ్యోతి ఫిలిమ్స్ పోస్ట్ చేసిన 'హీరోయిన్ స్నేహ' వీడియోను చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సత్య జ్యోతి ఫిలిమ్స్ పోస్ట్ చేసిన 'హీరోయిన్ స్నేహ' వీడియోను చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు!

  • దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా 'పటాస్‌' సినిమా
  • ఇటీవల విడుదల
  • గర్భిణీ అయినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న స్నేహ
  • సాహసోపేతంగా సాధన
ట్విట్టర్‌లో హీరోయిన్ స్నేహకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా సత్య జ్యోతి ఫిలిమ్స్ పోస్ట్ చేసింది. ఇందులో స్నేహను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎందుకంటే గర్భిణి అయిన స్నేహ చాలా ఉత్సాహంగా మార్షల్ ఆర్ట్స్ సాధన చేసింది. దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా 'పటాస్‌' సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

'అడిమురై' అనే వర్మకళ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో స్నేహ 'అడిమురై' నేర్చుకునే విద్యార్థినిగా, గురువుగా నటించారు. ఇందుకోసం ఆమె మూడు నెలలు శిక్షణ తీసుకుంది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాతే ఆమె గర్భం దాల్చారు. అయినప్పటికీ పట్టువదలకుండా ఇంట్లోనే శిక్షణ తీసుకున్నారు. చెన్నైలోని గిండి ఫ్లైఓవర్‌ వద్ద పోరాట సన్నివేశంలో ఆమె అడిమురై కళను ప్రయోగిస్తారు. ఆ సమయంలో స్నేహ నాలుగు నెలల గర్భిణి.  ఆ సన్నివేశాన్ని తెరకెక్కించే వరకు సినీ బృందం అంతా భయంతో వణికిపోయింది.
sneha
Twitter
Tollywood

More Telugu News