ముషారఫ్ కు చుక్కెదురు... పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రార్
- దేశద్రోహం కేసులో ముషారఫ్ కు మరణశిక్ష
- శిక్ష రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముషారఫ్
- పిటిషన్ స్వీకరించలేమన్న సుప్రీం కార్యాలయం
2007లో రాజ్యాంగాన్ని రద్దు చేశారంటూ ముషారఫ్ పై అప్పటి పీఎల్ఎం-ఎన్ ప్రభుత్వం న్యాయపోరాటం మొదలుపెట్టింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ముషారఫ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యానంటూ విదేశీ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా దర్శనమివ్వడం ప్రారంభించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తీవ్రమైన కేసుల్లో చిక్కుకుని అనారోగ్యానికి చికిత్స అంటూ లండన్ వెళ్లి అక్కడ ఓ రెస్టారెంట్లో కనిపించడం గమనార్హం.