నేను రాజీవ్ గాంధీ సిపాయిని... పీసీసీ రేసులో ఉన్నా: వీహెచ్

  • తెలంగాణ పీసీసీపై కన్నేసిన వీహెచ్
  • బీసీ నేతకు పదవి ఇవ్వాలంటూ డిమాండ్
  • పార్టీ శ్రేణుల మనోభావాలు తెలుసుకోవాలని సూచన
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై సీనియర్ నేత వి.హనుమంతరావు కన్నేశారు. గత కొంతకాలంగా పీసీసీ పీఠంపై తన ఆసక్తిని హైకమాండ్ కు చాటే ప్రయత్నాలు చేస్తున్న వీహెచ్ తాజాగా మరోసారి స్పందించారు. తాను రాజీవ్ గాంధీ సిపాయినని, పీసీసీ రేసులో తానూ ఉన్నానని స్పష్టం చేశారు. తనకు వయోపరిమితి సాకుగా చూపుతూ పీసీసీ అధ్యక్ష పదవి నిరాకరించే ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు.

తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని సూచించారు. పార్టీలోని అగ్రవర్ణాల నేతలు కూడా బీసీ వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నేతలకు ఢిల్లీలో అపాయింట్ మెంట్ ఇవ్వడం కాదని, జిల్లాల్లో పార్టీ శ్రేణుల మనోగతం తెలుసుకోవాలని హైకమాండ్ కు హితవు పలికారు.
Go Back to Shorts
Telangana
PCC
Congress
VH

More Telugu News