Minister: పవన్ ఓఎల్ఎక్స్ తత్వవేత్త.. పార్టీ సైద్ధాంతిక విలువలను అమ్మకానికి పెట్టారు: ఏపీ మంత్రి పేర్ని నాని

  • చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని పవన్ దత్తత తీసుకున్నారు
  • బేషరుతుగా కలిసి పనిచేస్తామని బీజేపీ నేతలకు ఎందుకు చెప్పారు? 
  • జగన్ పై సోనియా, చంద్రబాబు కలిసి కేసులు పెట్టించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైద్ధాంతిక విలువలు మరిచాడని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.  ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని పవన్ దత్తత తీసుకున్నారని విమర్శించారు. రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. అవకాశ వాద రాజకీయాలకు కొత్త చిరునామాగా పవన్ కల్యాణ్ మారారన్నారు. బాబుకు లోకేశ్ పై నమ్మకం లేదని, అందుకే పవన్ ను దగ్గరకు తీసుకుంటున్నారని ఆరోపించారు.

జగన్ పై సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి కేసులు పెట్టించారని అన్నారు. 'మీ మీద ఏం కేసులున్నాయి? ఢిల్లీ వెళ్లి బేషరతుగా పనిచేస్తామని బీజేపీ నేతలకు ఎందుకు చెప్పారు? అదే చొరవతో ఆ నేతలను ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటింపచేయచ్చు కదా?' అని ప్రశ్నించారు.  

ఓఎల్ఎక్స్ యాప్ వుంది... అందులో ఏ వస్తువునైనా అమ్మవచ్చు.. కొనవచ్చని.. అదేవిధంగా పవన్ తన సైద్ధాంతిక విలువలను అమ్మకానికి పెట్టారని ఎద్దేవా చేశారు. ఓఎల్ఎక్స్ లో రాజకీయ పార్టీని కూడా అమ్మకానికి పెట్టొచ్చని నిన్ననే తమకు అర్థమయిందని చెబుతూ, పవన్ ను ఆయన ఓఎల్ఎక్స్ తత్వవేత్తగా అభివర్ణించారు.
Minister
Andhra Pradesh
Perni Nani

More Telugu News