అమరావతిపై సీఎం జగన్ కసి పెంచుకుంటున్నారు: సీపీఐ రామకృష్ణ
- రాజధానిపై జగన్, విజయసాయి మాత్రమే నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
- మంత్రులతో చర్చించలేదని ఆరోపణ
- ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం
ఈ విషయంలో కనీసం ఉప ముఖ్యమంత్రులను కానీ, మంత్రులను కానీ సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి జోలికి రావొద్దని, వస్తే ఇక్కడి నుంచి మీ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని సీఎం జగన్ ను ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రైతులందరూ తరలిరావాలని కోరారు.