ఆ రెండు పార్టీలకు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసు: అంబటి
- బీజేపీ, జనసేన మైత్రిపై అంబటి వ్యాఖ్యలు
- పెద్దగా స్పందించాల్సిన అవసరంలేదన్న అంబటి
- కానీ తమకు కులతత్వం, కుటుంబపాలన, అవినీతి అంటగట్టారంటూ ఆగ్రహం
తమపై కులతత్వం, కుటుంబ పాలన, అవినీతి అంశాలను రుద్దడానికి ప్రయత్నించారని అంబటి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో కుల, కుటుంబ పాలన, అవినీతికి పాల్పడ్డారంటే అది వేరే విషయం, కానీ తమ ప్రభుత్వ ఏడు మాసాల పాలనను తప్పుబట్టడంతోనే తాము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.