బీజేపీ, జనసేనల భేటీ.. హాజరైన పురందేశ్వరి, సోము వీర్రాజు
- విజయవాడలో ప్రారంభమైన సమావేశం
- ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై చర్చ
- మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం
ప్రజా సమస్యలు, భవిష్యత్ ఉమ్మడి కార్యాచరణ, అమరావతి అంశాలపై వీరు లోతుగా చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇరు పార్టీల నేతలు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు బీజేపీ, జనసేనలు చేతులు కలపడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.