పవన్ కల్యాణ్ తో జరిగే భేటీలో ఈ అంశాలపై చర్చిస్తాం: జీవీఎల్
- కాసేపట్లో జనసేన, బీజేపీ భేటీ
- జనసేన తరపున హాజరుకానున్న పవన్, నాదెండ్ల
- నాలుగేళ్ల కార్యాచరణపై చర్చిస్తామన్న జీవీఎల్
మరోవైపు ఈ భేటీ నేపథ్యంలో కొందరు బీజేపీ కీలక నేతలు సమావేశమై... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, రానున్న నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇరుపార్టీల భేటీలో చర్చిస్తామని తెలిపారు. కేవలం అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే తమ సమావేశ అజెండా కాదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వ్యూహాలపై చర్చిస్తామని తెలిపారు.