తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ... నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్!

  • వేలాదిగా తరలివచ్చిన భక్తులు
  • దర్శనానికి 12 గంటల సమయం
  • నిన్న స్వామిని దర్శించుకున్న 81,394 మంది భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. సంక్రాంతి సెలవులు ముగిసేలోపు స్వామిని దర్శించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న వేలాది మంది కొండపైకి తరలిరావడంతో గడచిన నాలుగైదు రోజులుగా తగ్గిన భక్తుల రద్దీ, నేడు గణనీయంగా పెరిగింది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనం నిమిత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి దర్శనానికి 12 గంటల వరకూ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తుల దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 81,394 మంది భక్తులు దర్శించుకోగా, రూ. 2.47 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Tirupati
Piligrims
Vaikuntham

More Telugu News