తిరుమలలో మారిన గదుల బుకింగ్ విధానం... కొత్త నిబంధనలివే!
- ఎంత గది తీసుకుంటే, అంత మొత్తంలో డిపాజిట్
- ఖాళీ చేసిన తరువాత రిఫండ్
- తక్షణం ఆన్ లైన్ భక్తులకు, నెలాఖరు నుంచి ఆఫ్ లైన్ భక్తులకు అమలు
ఆఫ్ లైన్ లో... అంటే, తిరుమలకు వచ్చి, అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్ నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానం అమలైంది. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయమై టీటీడీ వివరణ ఇవ్వలేదు.