పంతం నానాజీ ఇంట్లో జనసేన కార్యకర్తలను పరామర్శించిన పవన్ కల్యాణ్

కాకినాడలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం పరామర్శించారు. కాకినాడ వచ్చిన ఆయన జనసేన నేత పంతం నానాజీ ఇంట్లో జనసేన కార్యకర్తలను కలుసుకున్నారు. గాయపడిన మహిళా కార్యకర్తలను ఆప్యాయంగా అక్కునచేర్చుకున్న పవన్ వారిని ఓదార్చారు. వారు చెప్పిన విషయాలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు తమపై దాడి దృశ్యాలను పవన్ కు మొబైల్ ఫోన్ లో చూపించారు. మరోవైపు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తుండడంతో పోలీసు బలగాలను మోహరించారు.

Pawan Kalyan
Andhra Pradesh
Kakinada
Jana Sena
YSRCP

More Telugu News