వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది: సీపీఐ రామకృష్ణ
- ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రైతులు వీధినపడ్డారు
- జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై విమర్శలు
- రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయింది
హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్ లో భేటీ అవుతోందని, రాష్ట్ర రాజధాని బతుకు చివరికి బస్టాండ్ అయిందని విమర్శించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలన్నది తమ పార్టీ నిర్ణయమని మరోమారు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కులపరంగా పాలనా వికేంద్రీకరణ జరగాలని, అయితే, జగన్ చెబుతున్న పాలనా వికేంద్రీకరణ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. రాజధాని మార్పు అంశంపై జగన్ ఎవరితో చర్చించారని ప్రశ్నించారు.