‘అల..వైకుంఠపురములో’కు సంబంధించి ఆ రెండు విషయాలు దాచాం: త్రివిక్రమ్ శ్రీనివాస్
- ఆ రెండు విషయాల్లో ఒకటి ‘సిత్తరాల..’ పాట
- షూట్ కు ముందు రోజు రాత్రే ఆ పాట మాకు అందింది
- రెండో విషయం.. బ్రహ్మానందం నటించినట్టు చెప్పకపోవడం
ఆ రెండు విషయాల్లో ఒకటి.. ఈ చిత్రంలోని ‘సిత్తరాల..’ పాట అని, శ్రీకాకుళం యాసలో ఈ పాట ఉంటుందని చెప్పారు. దీనిని షూట్ చేయడానికి ముందు రోజు రాత్రే ఆ పాట తమకు అందిందని, దీంతో, అప్పటికప్పుడు షూట్ చేశామని, అరగంటలో తమన్ ట్యూన్ చేశాడని, ఈ పాటను ఫైట్ గా తీశామని అన్నారు. ‘సిత్తరాల..’ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. రెండో విషయం.. బ్రహ్మానందం ఈ సినిమాలో నటించిన విషయాన్ని ముందే చెప్పకుండా దాచడం చాలా కష్టమైందని త్రివిక్రమ్ చెప్పారు.