SVBC: ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ సరస సంభాషణ... తీవ్ర కలకలం రేపుతున్న ఆడియో!

  • ఫోన్ లో అసభ్య సంభాషణ
  • నువ్వంటే ఇష్టమంటూ వెకిలి మాటలు
  • ఆడియోను ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్లు
శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్, నటుడు పృథ్వీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఉద్యోగినితో ఆయన జరుపుతున్న సరస సంభాషణ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చి కలకలం రేపుతోంది. మహిళా ఉద్యోగినికి ఫోన్ చేసిన పృథ్వీ, అసభ్యంగా మాట్లాడారు. తాను డ్రింక్ చేయడం లేదని, మరోసారి చేయడం మొదలు పెడితే, నీ దగ్గరే కూర్చుని తాగుతానని, కంపెనీ ఇవ్వాలని అడిగారు. అన్నం తినేటప్పుడు తాను గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. నువ్వంటే నాకిష్టమని అన్నారు. నువ్వు నా గుండెల్లో ఉన్నావని, నువ్వంటే ఇష్టమని చెప్పారు.

ఇక పృధ్వీ మాటలకు ఆ ఉద్యోగిని కూడా అలాగే స్పందించింది. నిత్యమూ గుర్తుకు వస్తారని, మీ కోసం వెయిట్ చేశానని చెప్పింది. కిలకిలా నవ్వుతూ మాట్లాడింది. తాను వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చానని, తనను వెనుకనుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నా అరవబోనని మాట్లాడింది. ఈ లీకైన ఆడియోను తెలుగు మీడియా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.
SVBC
Audio
Pruthvi
TV Channels
Leak

More Telugu News