కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు
- కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
- తెలంగాణను ఇస్తాంబుల్, డల్లాస్ గా చేశారా?
- యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నారు
ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా ఆ పార్టీ వెళ్లి కలిసేది టీఆర్ఎస్ లోనే అని విమర్శించిన లక్ష్మణ్, త్వరలోనే గాంధీభవన్ కు ‘టూలెట్’ బోర్డు పెడతారని సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఆయన మండిపడ్డారు. యువతను ఆయన రెచ్చగొడుతున్నారని, చట్టాలకు మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు.