జనసేన విస్తృతస్థాయి సమావేశం నుంచి మధ్యలోనే లేచి ఢిల్లీకి బయలుదేరిన పవన్ కల్యాణ్
- మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ
- పవన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- కేంద్ర ప్రభుత్వ ప్రముఖులను కలవనున్న పవన్
ఇక నేటి జనసేన సమావేశంలో అమరావతి రాజధాని తరలింపుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలిచి, పోరాటం చెయ్యాలని జనసేన భావిస్తోంది. త్వరలోనే విజయవాడలో కవాతు నిర్వహించే అంశంపై జనసేన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ప్రముఖుల అపాయింట్‌మెంట్ పవన్ కల్యాణ్‌కు ఖరారయిందని, అందుకే ఆయన హుటాహుటిన వెళ్లారని జనసేన నేతలు అంటున్నారు. ఆయన ఎవరిని కలుస్తారన్న ఆసక్తి నెలకొంది.