శ్రీనగర్ లోని పరిస్థితిని ఏపీకి తీసుకురావడం అన్యాయం: టీడీపీ నేత అశోక్ గజపతిరాజు
- అమరావతిపై సంతకాల సేకరణలో పాల్గొన్న నేత
- రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా?
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం
ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతల అరెస్టు సంస్కృతి లేదని చెబుతూ.. జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర లేపిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ఆపి విశాఖకు నీరు తెస్తాననడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకుని వెళ్లాలన్నారు. అందరినీ రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచిదికాదని సీఎం జగన్ కు సూచించారు.