ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన శార్దూల్... స్వల్ప స్కోరుతో సరిపెట్టుకున్న శ్రీలంక

ఇండోర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్ లో భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ కేవలం 5 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. శార్దూల్ కు తోడు సైనీ, బుమ్రా, కుల్దీప్ కూడా రాణించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారీ స్కోరు చేయనివ్వకుండా నిలువరించారు. సైనీ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసి లంక పతనంలో పాలుపంచుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో శార్దూల్ ఠాకూర్ విసిరిన 19వ ఓవర్ హైలైట్ అని చెప్పాలి. అప్పటివరకు తన ఖాతాలో వికెట్ లేకుండా ఉన్నా ఈ ముంబయి బౌలర్ ఆ ఓవర్ పూర్తయ్యేసరికి మూడు వికెట్లను సాధించాడు. లంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరీరా 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Go Back to Shorts
India
Sri Lanka
Indore
Shardul Thakur
Bumrah
Saini

More Telugu News