మా బిడ్డకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి వ్యాఖ్యలు
- నిర్భయ దోషులకు డెత్ వారెంట్
- జనవరి 22న ఉరి తీయాలన్న న్యాయస్థానం
- హర్షం వ్యక్తం చేసిన నిర్భయ తల్లి ఆశాదేవి
ఆ నలుగురు దుర్మార్గులకు మరణశిక్ష అమలు చేయడం మహిళలకు మరింత ఆత్మస్థైర్యం కలిగిస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ తీర్పు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, తీర్పు వెలువడిన అనంతరం న్యాయస్థానం వద్ద ఆశాదేవి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.