అభిమానుల బుగ్గలు కొరుకుతూ... హడావిడి చేసిన యాంకరమ్మ!

  • వైరల్ గా మారిన ‘పటాస్ షో‘ యాంకర్ వర్షిణి వీడియో
  • హైపర్ ఆదిని ఎత్తుకుని పైకి లేపి గుండ్రంగా తిప్పిన యాంకర్
  • విమర్శలతో విరుచుకుపడుతున్న నెటిజన్లు
టీవీ షోకు యాంకర్లు వన్నె తెస్తారనటంలో సందేహం లేదు. అయితే, ఓ యాంకర్ ఓ టీవీ షోలో చేసిన పనికి మాత్రం ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్న యాంకర్ వర్షిణి సౌందరరాజన్ చేసిన పనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, వ్యంగోక్తులు వెల్లువెత్తుతున్నాయి. వర్షిణి ‘పటాస్ షో’ లో యాంకరింగ్ చేస్తూ.. అభిమానిని స్టేజ్ పైకి పిలిచి మరీ బుగ్గ కొరికింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

వర్షిణి దూకుడు అంతటితో ఆగిపోలేదు. హైపర్ ఆదిని ఎత్తుకుని పైకి లేపి గుండ్రంగా తిప్పిసేంది. దీంతో వర్షిణిపై నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. యాంకర్ల ప్రవర్తనకు కూడా ఓ హద్దుంటుందని మండిపడుతున్నారు. పటాస్ షో నుంచి శ్రీ ముఖి వెళ్లిపోయిన తర్వాత వర్షిణి వచ్చింది. తనకంటూ గుర్తింపు పొందడానికి ఏదో వెరైటీ చేయాలని ఈ విధంగా చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇకముందు ఇంకా ఎలాంటి వెరైటీలతో ఆకట్టుకుంటుందో చూడాలంటూ.. కామెంట్లు పెట్టేవారు కూడా ఉన్నారు.
Go Back to Shorts
TV Anchor
Varshini Soundhara Rajan
Kissing
Fan

More Telugu News