ముందే వచ్చిన సంక్రాంతి... పండంటి బాబుకు జన్మనిచ్చిన అనిల్ రావిపూడి భార్య!
- ఈ ఉదయం బిడ్డకు జన్మనిచ్చిన భావన
- అభినందనలు తెలిపిన మహేశ్ బాబు
- ఆశీర్వదించిన సినీ ప్రముఖులు
ఇక అనిల్ రావిపూడికి బాబు పుట్టాడన్న వార్తను తెలుసుకున్న మహేశ్ బాబు, అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, అనిల్ దంపతులు ఇప్పుడు చాలా గర్వపడుతుంటారని అన్నారు. వారి కుటుంబంపై దేవుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అనిల్ దంపతులను ఆశీర్వదించారు.