ఇంత వరకు ఎవరూ నాపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. చేస్తే చెబుతా: సీపీఐ నారాయణ
- రాజకీయాలు రాజకీయాల్లా లేవు
- ఏం మాట్లాడినా లేనిపోనివి ఆపాదిస్తున్నారు
- అమరావతిపై మాట్లాడితే..నన్ను చంద్రబాబు సామాజిక వర్గమే అంటారేమో!
మాతృభాషలో విద్యాబోధన జరగాలన్నది తమ పాలసీ అని, ఈ విషయమై ప్రశ్నిస్తే.. ‘నీ కూతురు, కొడుకు అమెరికాలో చదవట్లేదా?’ అని అనడం ‘బ్లాక్ మెయిల్’ కిందకు వస్తుందని, వ్యవస్థ కోసం తాము ప్రశ్నిస్తుంటే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం తగదని అన్నారు. రాజధాని అమరావతి గురించి ఏదైనా మాట్లాడితే.. ‘నారాయణ కూడా చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి ఆయన అంటున్నాడంటారు’ అని విమర్శించారు.
అయితే, ఇంత వరకూ ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు తనపై చేయలేదని, చేస్తారేమోనని భయంగా వుందంటూ సెటైర్లు వేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయనివ్వండి, చేసిన తర్వాత సమాధానం చెబుతానని అన్నారు.