కశ్మీర్ లో పోలీసులకు పట్టుబడిన లష్కర్ ఉగ్రవాది
- ఏడాది కిందట లష్కరే తోయిబాలో చేరిన కశ్మీర్ యువకుడు
- ఆర్మీతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన కశ్మీర్ పోలీసులు
- భారీగా ఆయుధాలు స్వాధీనం
కొంతకాలంగా భద్రతాబలగాలపై దాడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి నిస్సార్ గతేడాది జరిగిన ఎన్ కౌంటర్ లో కొద్దిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఇప్పటివరకు అతడిపై 8 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈసారి ఆర్మీతో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ తో నిస్సార్ పోలీసుల చేతచిక్కాడు. అతడి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.