Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రమోహన్ గారి జోడీగా చేస్తే దశ తిరిగిపోతుందనేది నిజమే: సీనియర్ నటి కవిత

  • 'సిరి సిరి మువ్వ'లో చేశాను 
  • చంద్రమోహన్ అలా అన్నారు 
  •  అలాగే జరిగిందన్న కవిత 
తెలుగు తెరపై రాణించిన నిన్నటితరం కథానాయికలలో కవిత ఒకరు. చురుకుగా .. చలాకీగా వుండే పాత్రలను ఎక్కువగా పోషించిన కవిత, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చంద్రమోహన్ గురించి ప్రస్తావించారు.

'చంద్రమోహన్ సరసన నటించినవారి దశ తిరిగిపోతుందనే టాక్ అప్పట్లో ఉండేది .. అది నిజమే. ఆయన సరసన నటించిన తరువాత ఎంతోమంది కథానాయికలు స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. 'సిరి సిరి మువ్వ'లో నేను చేస్తున్నప్పుడు, టాప్ హీరోయిన్ ను అవుతానని యూనిట్ వాళ్లు మా అమ్మతో చెప్పారు. చంద్రమోహన్ గారు కూడా అదే మాట అన్నారు. 'నాతో చేసిన వాళ్లంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు .. నీకేం తక్కువ .. నువ్వు కూడా అవుతావులే' అన్నారు. నిజంగానే ఆ తరువాత నాకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయి .. మంచి గుర్తింపు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.
Chandra Mohan
Kavitha

More Telugu News