ఈ సమస్యను పరిష్కరిస్తే.. రూ.35 లక్షలు మీవే.. ఎన్పీసీఎల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ బంపర్ ఆఫర్
- ఫీచర్ ఫోన్లలో యూపీఐ సౌకర్యాలు కల్పించాలని సవాల్
- దేశంలో ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నవారి సంఖ్య 50 కోట్లు
- బిల్ అండ్ మెలిండా గేట్స్ పౌండేషన్, సీఐఐఈ.సీవోతో కలిసి ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు(రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు(రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది చక్కని అవకాశమని పేర్కొంది. ఈ పోటీ ఈ నెల 12న ముగియనున్నదని, విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది.