అరుదైన సందర్భం... నూతన సంవత్సరం రోజు ఒకేచోట 41 మంది పుట్టిన రోజు!

  • మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహణ 
  • అంతా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు 
  • పాఠశాలలో మొత్తం 883 మంది

పుట్టిన రోజు ఎవరి జీవితంలోనైనా సాధారణంగా వచ్చేదే. కానీ ఒకే రోజు ఒకే చోట ఉన్న విద్యార్థినుల్లో ఎక్కువ మందిది వస్తే అది అరుదైన సందర్భమే కదా. ఇటువంటి అరుదైన ఘటన మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిన్న వెలుగు చూసింది. మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మొత్తం 883 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.

తమ పుట్టిన రోజు (జనవరి 1న) కావున వేడుకలు నిర్వహించుకుంటామని ఒకరిద్దరు విద్యార్థినులు వసతి గృహం సంక్షేమాధికారిణి రోజనీలా వద్దకు వెళ్లి అనుమతి అడిగారు. దీంతో సంక్షేమాధికారిణి వెంటనే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల్లో ఇంకా ఎవరైనా ఇదే రోజున పుట్టిన వారు ఉన్నారా? అంటూ ఆరాతీశారు. దీంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఉన్నవారిలో మొత్తం 41 మంది జనవరి ఒకటిన పుట్టినట్లు గుర్తించారు. దీంతో అందరి పుట్టిన రోజు ఒకే చోట సందడిగా చేయాలని నిర్ణయించి అలాగే జరిపారు. అందరిచేత కేక్ కట్ చేయించి చిరు కానుకలు అందజేశారు.

Go Back to Shorts
birthday
Mahabubabad District
41 students

More Telugu News