ఉత్తమ్ కుమార్ పై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
- హైదరాబాద్ సీపీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడిన భాష సరికాదు
- ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది
- దారుస్సలాం ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక
- ఈ మైదానంలో గతంలో ఇందిరా గాంధీ కూడా సభ నిర్వహించారు
'హైదరాబాద్ సీపీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడిన భాష సరికాదు.. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. దారుస్సలాం ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక. ఈ భారీ మైదానంలో గతంలో ఇందిరా గాంధీ కూడా బహిరంగ సభ నిర్వహించారు. సీఏఏపై ఆందోళనలు నిర్వహించడానికి ఉత్తమ్ కుమార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.. మేము నిజామాబాద్ లో ఇదే విషయంపై నిర్వహించిన సభలో మాత్రం ఆయన పార్టీ పాల్గొనలేదు.. మా ఆహ్వానాన్ని తిరస్కరించింది' అని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.