Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్యాలెండరే శుభలేఖ.. ఇంజినీర్ వెరైటీ ఆలోచన

  • నెల్లూరు యువ ఇంజినీర్ వినూత్న ఆలోచన
  • 2020 క్యాలెండర్ రూపంలో పెళ్లి శుభలేఖ
  • సోషల్ మీడియాలో వైరల్
ఓ యువ ఇంజనీర్ తన పెళ్లి శుభలేఖలను వెరైటీగా ముద్రించి పంచిపెట్టాడు. అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి కొత్త సంవత్సరం వేళ క్యాలెండర్ రూపంలో తన వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి అందరికీ పంచిపెట్టాడు.

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడుకు చెందిన సాయిమురళీకృష్ణారెడ్డి అమెరికాలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సౌమ్యరెడ్డితో పెళ్లి నిశ్చయం చేసుకున్న ఆయన తన శుభలేఖను వినూత్నంగా డిజైన్ చేయాలని భావించాడు. దీంతో 2020 క్యాలెండర్ల రూపంలో శుభలేఖను ముద్రించి పంచిపెట్టాడు. వెయ్యి క్యాలెండర్లు ముద్రించి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు పంచిపెట్టాడు. అతడి శుభలేఖను చూసి అందరూ ముగ్ధులవుతున్నారు.
wedding card
Nellore
Engineer

More Telugu News