తెలుగు తెరకి మరో కొత్త కథానాయికగా 'కృతి శెట్టి'
- ముగింపు దశలో 'ఉప్పెన'
- దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం
- ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి
చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తున్న ఈ అమ్మాయి, 'ఉప్పెన' సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ కొడితే యువ కథానాయకుల జోడీగా ఆమె జోరు కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.