తగ్గనున్న ఈఎంఐ... వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
- ఈబీఆర్ ను పావు శాతం తగ్గించిన ఎస్బీఐ
- గృహ, ఎంఎస్ఎంఈ రుణగ్రస్తులకు ఊరట
- స్టాక్ మార్కెట్లో ఈక్విటీ 2 శాతం పతనం
ఈ నిర్ణయం కారణంగా రెపో రేటుతో అనుసంధానించబడిన రుణ వినియోగదారులకు లబ్ది కలుగనుంది. తాజా నిర్ణయంతో తగ్గింపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ ఎనిమిది సార్లు వడ్డీ రేటును తగ్గించినట్లు అవుతుంది. ఇక కొత్త సంవత్సరంలో గృహాలను కొనుగోలు చేయాలని భావించే వారికి 7.90 శాతం వడ్డీ రేటుకే రుణాలు లభించనున్నాయి. కాగా, బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం నికర లాభాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. బ్యాంకు ఈక్విటీ ఈ ఉదయం మార్కెట్ లో 2 శాతానికి పైగా నష్టపోయింది.